వీడ్కోలు సన్మాన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదోన్నతి పై వెళ్లిన శ్రీనివాస్ (సాంఘిక శాస్త్ర బోధకులు)అనే ఉపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీనివాస్ అందించిన సేవల గూర్చి వివరించారు. విద్యార్థుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీనివాస్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. గురువుల గొప్పదనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రామస్వామి, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, నర్సారెడ్డి, భృగు మహర్షి, రామారెడ్డి, శ్రీనివాస్, పద్మ, రాజేందర్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!