బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానాలోని రిజిస్టర్, రికార్డులను ఆమె పరిశీలించారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆమె అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలని, ఆరోగ్య జాగ్రత్తల పట్ల సూచనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవఖాన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!