నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6
ఈరోజు స్థానిక ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ఎగ్జిబిషన్ సంయుక్తంగా నిర్వహించారు ఇన్స్పైర్ ప్రదర్శనలో 126 ఎగ్జిబిట్లతో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా శ్రీ పింటూ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి వచ్చి పరిశీలించడం జరిగింది. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శని అను కార్యక్రమానికి సంబంధించి 410 ఎగ్జిట్లతో వివిధ యాజమాన్యాల నుంచి విద్యార్థులు వారి గైడ్ టీచర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి , అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ , జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి కే గంగా కిషన్, డైట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, వాసుదేవరావు సాయిరెడ్డి కాంతారావు , సురేష్ హెడ్మాస్టర్ మరియు వివిధ సంఘల నాయకులు పాల్గొన్నారు.రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రధాన అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అను ప్రధాన అంశంలో ఆరోగ్యము ఆహారము పరిశుభ్రత ,నేచురల్ ఫామింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఉప అంశాలు నందు విద్యార్థులు వివిధ ప్రదర్శనలతో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు సభాధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తద్వారా సామాజికంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయని ఇలాంటి కార్యక్రమాలు లో విస్తృతంగా ఏర్పాటుచేసి విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయవలెనని అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈరోజు మనం ఎన్నో రకాల సుఖవంతమైన విలాసవంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నామని అయితే సుస్థిర అభివృద్ధి కోసం వనరులను సద్వినియోగం చేసుకుంటూ రేపు ఒకటి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సంరక్షించుకొనవలెనని కూడా తెలియజేయడం జరిగింది.