క్రమశిక్షణకు మారుపేరు గురుకుల విద్య – రాష్ట్ర అధ్యక్షులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 4.అర్మూర్ పట్టణ కేంద్రంలో బి.ఆర్.నర్సింగ్ రావు,రైటర్ సీనియర్ జర్నలిస్టు ,కాల మిస్టు & రచయిత నవంబర్ 4:- క్రమశిక్షణకు మారుపేరు సంక్షేమ గురుకులాలు అని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ టీచర్స్ సంగం అధ్యక్షులు కె.నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ పూర్వ విద్యార్థుల మొదటి బ్యాచ్ విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ అన్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సంక్షేమ గురుకులంలో 1997 99 పూర్వ విద్యార్థుల సామూహిక సదస్సు ఆదివారం రోజు మదన్ పెళ్లి లక్ష్మ రెడ్డి అతిథి గృహంలో అత్యంత వైభవంగా జరిగింది. పూర్వ మాజి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు గురుకుల విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారని అందులో భాగంగా ఆర్మూర్ సంక్షేమ గురుకులంలో 1997-99 లో ఇంటర్ చదివిన విద్యార్థులు విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో ఉద్యోగులుగా, వ్యవ సాయదారులుగా డాక్టర్స్ గా స్థిరపడ్డారని అందుకు విద్యార్థుల్ని అభినందించారు.ఈ సందర్భంగా ఆర్మూర్ సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ జి.పూర్ణచెందర్ రావు మాట్లాడుతూ ఆర్మూర్ లో చదివి వివిధ రంగాల్లో స్థిర పడినందుకు గర్వంగా ఉందని మళ్ళీ ఒకసారి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న పాఠశాలను సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బొటనీ లెక్చరర్ జి.కిషన్ మాట్లాడుతూ 1985 నుండి 1999 వరకు సంక్షేమ గురుకులాల్లో విద్యను ఆదర్శించిన విద్యార్థులే నేడు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారని
సమాజంలో ఎప్పుడైతే “సెల్ ఫోన్ భూతం” వచ్చిందో అప్పటి నుండి
విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి కోర వడిందని అవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు “సెల్ ఫోన్ లను”విద్యార్థులకు దూరంగా ఉండే చట్టాన్ని తీసుక రావాలని ఆయన అభిప్రాయ పడ్డారు.ఈ సందర్భంగా పూర్వ
వ్యాయమ సంచాలకులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ యూత్ ప్రాజెక్టు,యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్
,దక్షిణ ఆసియా మైత్రి సదస్సు సెక్రటరీ జనరల్ బి.ఆర్.నర్సింగ్ రావు మాట్లాడుతూ సమాజంలో
సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత విద్యార్థులు విద్యారంగానికి వదలిపెట్టి సెల్ ఫోన్ కే అంకితమై పోతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేసారు,పుట్టిన ఊరు చరిత్రను మరిచిపోయి విదేశీ సాoస్కృతికి అలవాటు పడ్డారని భారతీయ విద్యారంగానికి ఇది చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ అయిన ఎం శివరాం,టీ.థామస్ రెడ్డి,రమణ రెడ్డి,గురుకులాల్లో పని చేసి రిటైర్డ్ అయిన సీనియర్ లెక్చరర్లు, దాత్రిక వెంకటేశ్వర రావు,ఉపాద్యాయులైన ఎస్.ఎన్. మోహన్ రెడ్డి, వెంకన్న, దేవేందర్ రావు,మార్కండేయులు, యన్.రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల నాయకులైన అంబర్ సింగ్(ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) హులియ (హెడ్ మాస్టర్) జీవన్,కిరణ్,రాజయ్య తదితరులు 1997-99 ఇంటర్ బ్యాచ్ బృందం కార్యక్రమాన్ని విజయ వంతం చేసారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!