రక్తదానం చేసి ప్రాణదాతలు కండి -డీఈవో ఆశోక్

నిజామాబాద్ జై భారత్ మే :29 స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లి లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదన శిబిరానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానలకన్న గొప్పదని,రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు.ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ను అభినందిస్తూ,ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలో జూనియర్ క్రాస్ ను బలోపేతం చేద్దామని ఉపాధ్యాయులకు సూచించారు. సుమారుగా 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకం అని దానిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణం అని అన్నారు.ఈ సందర్భంగా టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు రక్త దానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అర్బన్ మండల విద్యశాఖ అధికారి అండ్ కోర్స్ డైరెక్టర్ సాయిరెడ్డి సబ్ అధ్యక్షత వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కే రవీందర్ జేఆర్సి కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్, డాక్టర్ రాజేష్ 

మెడికల్ ఆఫీసర్, ప్రతినిధులు ధర్మేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకట్, శ్రీనివాస్, నగేష్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వివిధ అంశాలలో ట్రైనీ ట్రైనింగ్ స్టూడెంట్స్ 420మంది, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాయి రెడ్డి కోర్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!