Headlines:
-
ఆర్మూర్ శ్రీ భాషిత విద్యార్థుల చెవిటి, మూగ పాఠశాల సందర్శన
-
సమాజ సేవలో భాగంగా విద్యార్థుల చెవిటి, మూగ పాఠశాల సందర్శన
-
మానవతా విలువలపై అవగాహన కోసం శ్రీ భాషిత పాఠశాల విద్యార్థుల పాఠశాల సందర్శన
ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల కు చెందిన ఏడవ తరగతి విద్యార్థులు (Deaf & Dumb) చెవిటి, మూగ పాఠశాలను సోమవారం రోజు సందర్శించారు.
ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు తోటి విద్యార్థులతో గౌరవభావం, స్నేహం, మానవతా విలువలు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రత్యక్షంగా ఒకరి కి ఒకరు చర్చించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ ఇటువంటి కమ్యూనిటీ రీచ్ కార్యక్రమాలు విద్యార్థులకు మంచి స్పూర్తిని అందిస్తాయి. అంతేకాకుండా సమాజంలో వివిధ ప్రాథమిక అవసరాలపై అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పారు.
అనంతరం విద్యార్థులు వారికి పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు…