నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యూట్ అభ్యర్థిలను కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు వెల్మల్ గ్రామస్థులతో సమావేశమై అభివృద్ధికి ఓటు వేసేలా పిలుపునిచ్చారు.నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఇంద్రమ్మ ఇండ్లు వంటి పథకాలను అందిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.గ్రామస్థులను ఉద్దేశించి నాయకులు, “ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధిని కోరే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ను గెలిపించి, రాష్ట్రంలో మరింత అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాళ్ల సాయి రెడ్డి, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీమంద మైపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు జి. రాజేందర్, వెల్మల్ గోపి, గ్రామ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.