సీఎం రేవంత్ కు ప్రమాద స్థలికి వెళ్లే తీరిక లేదా?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మే:18
మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత మరిచిన సీఎం.
అందాల పోటీలు, విహారయాత్రలు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా?
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి.
మంటల్లో 17మంది మరణించడం బాధాకరం.మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి..ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన రాష్ట్రమంతా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి గుల్జార్ అగ్ని ప్రమాద ఘటన జరిగిన స్థలానికి వెళ్లే తీరిక లేదా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యతను ముఖ్యమంత్రి మరిచి బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. సీఎంకు అందాల పోటీలు, విహారయాత్రలు, ఫోటోషూట్లు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? అని జీవన్ రెడ్డి నిలదీశారు. ఎక్కడో ఉన్న ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్న మన సీఎంకు మాత్రం ఈ ఘటన చాలా చిన్నదిగా కనిపించడం సిగ్గు చేటు అని ఆయన ఎద్దేవా చేశారు.ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంటల్లో 17 మంది మరణించడం, పలువురు గాయపడటం బాధాకరమని ఆయన ఒక ప్రకటనలో తన ఆవేదన తెలిపారు.మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వేసవి కాలంలో రాష్ట్రమంతా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలే దని జీవన్ రెడ్డి విమర్శించారు.ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!