నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.
నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి సూచనల మేరకు జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆదేశానుసరంగా 9వ తేది న సాయంత్రం నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ నగరంలో అర్సపల్లి బైపాస్ నుండి ధర్మారం వెళ్లే మార్గ మధ్యంలో తనిఖీలు నిర్వహించారు. రెండు వాహనాలలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఆదివారం తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు,ఎస్ హెచ్ ఓ దిలీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి, పల్సర్ బైక్ ను సీజ్ చెయ్యడం జరిగిందని తెలియజేశారు. సర్ఫరాజ్ ఖాన్ ను విచారించగా మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం నుండి నిజామాబాద్ కి తరలించుకుని అధిక లాభానికి అమ్ముతానని తెలిపాడు. అదే మార్గంలో గంజాయి తరలిస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా నిజామాబాద్ ద్వారకానగర్ కి చెందిన సాజిత్ అలీ అనే వ్యక్తి ఆటోను వదిలి పారిపోవడం జరిగిందని తెలిపారు. సాజిద్ అలీ ఆటోలో 2.1 కేజీ ల గంజాయి లభ్యం కాగా . మొత్తం రెండు కేసులలో (4.2) కేజీలు గంజాయి,1 పల్సర్ బైక్, ఒక ఆటో ను సీజ్ చెయ్యడం జరిగిందని వివరించారు. ఈ కేసు లో సర్ఫరజ్ ఖాన్ నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ తనిఖీలలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్, ఎస్సై మల్లేష్, షబ్బీర్, ప్రభాకర్, దారి సింగ్, రవి, సంగయ్య, సౌమ్య, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.