నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-27
పోలీసులతోపాటు అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడికి బాధితుల ఫిర్యాదు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ బీ జే పీ నాయకురాలు కోటి రూపాయలకు టోకరా వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన సమీప బంధువుల వద్ద వడ్డీ ఆశ చూపి కోటి రూపాయలకు టోకరా వేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసులు ఫిర్యాదు పై స్పందించకపోవడంతో బిజెపి నాయకురాలిపై అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త తో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారికి గురువారం ఫిర్యాదు చేశారు. నగరంలోని పూసాల గల్లీకి చెందిన బిజెపి మహిళా నాయకురాలు తన బంధువుల దగ్గర అధిక వడ్డీలు చెల్లిస్తానని ఆశ కల్పించి తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేయడంతో బాధితులు నగరంలోని వన్ టౌన్,రెండవ టెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో నిజామాబాద్ ఏసిపి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. అక్కడ కూడా న్యాయం జరగడంతో సదరు మహిళ నాయకురాలిపై అర్బన్ ఎమ్మెల్యే, బిజెపి జిల్లా అధ్యక్షుడు కి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పార్టీ పేరు చెప్పి తమని బెదిరింపులకు పాల్పడుతుందని సదరు మహిళపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.