నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4.
నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS మేడం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు CCS సిబ్బంది ఈరోజు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోజన్న తోట నందు నిర్వహించబడిన పేకాట స్థావరం పై దాడి చేసి 6మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుండి 5 ద్విచక్ర వాహనాలు,4 సెల్ ఫోన్స్,21960/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి అప్పగించడం జరిగింది.