తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16.
ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది.
మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించిన సిబ్బంది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ.. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష తల్లిని వడిలో పడుకోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళ