దండారి ఉత్సవాలకు 15వేల మంజూరు: సంస్కృతి

సంస్కృతి
Headlines:
  1. సంస్కృతి – సంప్రదాయాలను మరవద్దని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరిక
  2. దండారి ఉత్సవాలకు 1.50 కోట్ల నిధులు మంజూరు
  3. అదివాసీ సంప్రదాయాలను సురక్షితంగా ఉంచేందుకు ఎమ్మెల్యే పిలుపు

తరతరాలుగా ఆచరిస్తున్న సంస్కృతి సంప్రదాయాలను మరువద్దని ఖానాపూర్ నియోజవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.మంగళవారం సిరికొండ మండలంలోని సాత్మోరి, బోరింగ్ గూడా గ్రామాలలో దండారి ఉత్సవాలలో పాల్గొన్నారు.ముందుగా దేవతలకు ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని తెలిపారు.

సంస్కృతి

ప్రకృతిని దైవంగా భావించి పూజలు చేయడం తరాలుగా వస్తున్న ఆనవాయితని పేర్కొన్నారు. దండారి ఉత్సవాలలో డీజేలు పెట్టొద్దని సూచించారు.ఆకాడి పండుగ నుండి మొదలుకొని దీపావళి పండుగ వరకు ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ దండారి ఉత్సవాలు అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దండారి ఉత్సవాలకు 1కోటి 50 లక్షలు మంజూరు చేసిందని అన్నారు.ఐటీడీఏ పరిధిలోని వెయి గ్రామాల్లో ప్రతి దండారికి 15వేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు.దండారి ఉత్సవాలకు నిధులు మంజూరు చేయడం పట్ల వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క గారికి ఖానాపూర్ నియోజవర్గ ఆదివాసీ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!